ఎంఎల్‌ఎ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

Apr 5,2024 22:36

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎంఎల్‌ఎ వేగుళ్ల

ప్రజాశక్తి- మండపేట

స్థానిక కలువ పువ్వు సెంటర్‌ లోని జామియా మస్జిద్‌ లో ముస్లింలకు ఎంఎల్‌ఎ వేగుళ్ల శుక్రవారం సాయంత్రం ఇఫ్టార్‌ విందు నిర్వహించారు. వారితో కలిసి ఉపవాస దీక్ష విరమణలో పాల్గొన్నారు. తొలుత మసీదుకమిటీ మేనేజమెంట్‌ సభ్యులు ఎంఎల్‌ఎను సత్కరించారు. అనంతరం ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఛైర్మన్‌ చుండ్రు శ్రీ వర ప్రకాష్‌, వేగుళ్ళ అజరు బాబు, టౌన్‌ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మండపేట జామియా మసీదు కమిటీ అధ్యక్షులు ఎండి అల్తాఫ్‌, కరీం ఖాదరి, సల్మాన్‌హుస్సేన్‌, ఎండి అబ్దుల్‌ రజాక్‌ బడా తదితరులు పాల్గొన్నారు.

 

➡️