పాపారావును సన్మానించిన కలవచర్ల వాసులు

Feb 17,2024 13:23 #Konaseema
Kalavacharla residents honored Paparao

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని కలవచర్ల శ్రీసీతారామ ఆలయ వారోత్సవాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీమురళీకృష్ణ సంస్థల అధినేత, దాత వంటిపల్లి పాపారావు ఆలయ ఉత్సవ కమిటీకి శనివారం రూ. 40 వేలు విరాళంగా ఇచ్చారు. అలాగే ఆయన స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా గ్రామ పెద్దలు పాపారావుకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సు కొరకు మీరు చేసే సప్తాహ కార్యక్రమాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు, జీవరాశులు సుభిక్షంగా ఉంటాయని ఆకాంక్షించారు.

➡️