ఖరీఫ్‌ సన్నద్ధతపై సమావేశం

May 24,2024 22:01

మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

స్థానిక కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాఅధికారులతో శుక్రవారం ఖరీఫ్‌ సాగు, తుఫానుల కోసం విపత్తు నిర్వహణ, ఉపశ మనం, సన్నద్ధత చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఖరీఫ్‌ సీజన్‌ లో ముందస్తుగా తక్కు వ పంట కాలపరిమితి గల వరి వంగడాల సాగును ప్రారంభించి అక్టోబర్‌ నెల చివరి నాటికి పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు చేపట్టి నవంబర్‌ నెలలో సంభవించే తుఫానుల నుంచి రక్షణ పొందేలా రైతులను చైతన్య పరచాలని ఆదేశించారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం కావాలని ఆదేశించారు. తుఫాన్లు వరదలు విపత్తులను ఎదుర్కొనే దిశగా ముందస్తు ఖరీఫ్‌, రబీ సీజనులను ఆరంభించే దిశగా జల వనర్లు వ్యవసాయ శాఖ అధికారు లు రైతులను చైతన్య పరచాలని ఆదేశించారు. గోదావరి ఏటిగట్టు సుమారు 380 కిలోమీటర్లు మేర ఉందని ఈ ఏటిగట్టు ఆరు చోట్ల బలహీనంగా ఉందని పటిష్టపరి చేందుకు, గట్టు ఎత్తు తక్కువను గుర్తించి ఎత్తు కొరకు అంచనాల రూపొందించి సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు జూన్‌ ఒకటో తేదీ నుండి సాగునీరు విడుదల చేస్తారని అన్నారు. జూన్‌ 10 నాటికి సాగునీరు అందు తుందన్నారు. తదుపరి జూన్‌ 15 నుండి నారుమడి, నర్సరీల సాగును చేప ట్టాలని సూచించారు. కాలువ చివరి ఆయకట్టు గల రైతులు ముందుగా నీరు పారే ప్రాంతంలో కమ్యూనిటీ నర్సరీలను అభివృద్ధి చేసి తదుపరి వరి నాట్లు సాగును ప్రారంభించాల ని సూచించారు. ముందస్తుగా సాగు చేపట్టడం కొంత మేర కష్టమే అయి నప్పటికీ రైతులను అన్ని విధాల ఒప్పించి ఎక్కడా క్రాఫ్‌ హాలిడేకు ఆస్కారం లేకుండా ఇరు శాఖలు పూర్తి సమన్వయం వహించాలన్నా రు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి ఖరీఫ్‌ దిగుబడులు తుఫాను బారిన పడ కుండా ముందస్తు సాగు అన్ని విధాల ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రైతులు విత్తనాలు లభ్యత లేబర్‌ టయప్‌ అంశాలలో అప్రమ త్తంగా వ్యవహరించి ముందస్తు సాగుకు ఉపక్రమించాలని సూచిం చారు. జూన్‌ 30 నాటికి మంజూరైన పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రధాన కాలువలలో గుర్రపుడెక్క పూడిక తీత పనులు నరేగా ద్వారా వేగవం తం చేసి పూర్తి చేయాలని ఆదేశిం చారు. ప్రధానకాలువల్లో ముందుగా సాగునీరు పారేందుకు ఆటంకంగా ఉన్నచోట పనులకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు నరేగా ఉపాధి పనుల మూలంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా ఆయా గ్రామాల అభివృద్ధికి సమకూరనున్నదన్నారు. అల్లవరం ఉప్పలగుప్తం మండలాల్లో రామే శ్వరం మొగ తదితర సముద్ర ముఖ ద్వారాల వద్ద డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టి ముంపు బెడదను నివారించవచ్చన్నారు. వరి సాగు క్షేత్రాలలోని ఎండు గడ్డిని మిషన్ల ద్వారా సేకరించి గ్రామాలలో నిలువ చేసి తుఫాను సందర్భంలో పశువులకు పశుగ్రాసంగా అందించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించడానికి, తాత్కాలిక ఉపశమన చర్యల కొరకు సమర్థ వంతమైన వ్యూహాలను రచించి అమలు చేయాలన్నారు. ప్రధానంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించేందుకై వివిధ కోణాలలో ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. పట్టణాలు నగర పంచాయితీలలో కూడా పూడికతీత పనులకు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు అంచనాలు రూపొందించి సమర్పించిన యెడల నిధులు కేటాయిస్తారన్నారు. హైరిస్క్‌ జోన్ల నుంచి వ్యక్తులను తరలించడానికి కూడా వ్యూహ రచన చేయాలన్నారు. తుఫానుల వల్ల కలిగే విధ్వంసాన్ని అధిగమించడానికి ముఖ్యమైన ప్రక్రియ ఉపశమన వ్యూహమన్నా రు. ముందస్తు హెచ్చరికలు వ్యవస్థ ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో నివ సించే ప్రజలను అప్రమత్తం చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌డిఒ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

➡️