ఐలాండ్ గ్రామం శేరిలంకలో పర్యటించిన ఎంపీ బోస్

Mar 17,2024 12:15 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : గౌతమి గోదావరి ఐలాండ్ గ్రామమైన శేరి లంకలో ఆదివారం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పెద్దలు లనుకలిసిమాట్లాడారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాసరాజు మండల అధ్యక్షులు పంపన నాగమణి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు పెట్టా శ్రీనివాసరావు, సర్పంచ్ కొండేపూడి భద్రరావు, ఎంపీటీసీ కొండేపూడి భవాని, గిడ్డి బాలకృష్ణ, కొండేపూడి చంటి బాబు, పోలిశెట్టి నాగేశ్వర రావు ఉప సర్పంచ్, అనిశెట్టి చంటి గారు,గ్రామ పెద్దలు , మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, సొసైటీ చైర్మన్ లు, వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

➡️