వైసీపీలో చేరిన ముస్లిం యువకులు

Mar 21,2024 13:43 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం సుమారు వంద మంది ముస్లిం యువకులు, వైసీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పిల్లి సూర్య ప్రకాష్ సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నవాజ్ ముస్లిం కమిటీ యువకులు పెద్దయెత్తున పార్టీలో చేరడంతో వారి ఉద్దేశించి సూర్యప్రకాష్ మాట్లాడారు. ముస్లిం మైనార్టీల సమస్యలను వైఎస్ఆర్ ప్రభుత్వం పరిగణంలోని తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసిందని వివరించారు. మతతత్వ పార్టీల కంటే వైయస్సార్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తుందని ఆయన వివరించారు. ముస్లిం యువకులు పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉందని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శ్రీనివాసరాజు, పెంటపాటి శ్రీను, పలువురు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️