శ్రీ చైతన్యలో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం

Mar 30,2024 12:39 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ లో ఫ్రీ ప్రైమరీ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మినారాయణ తెలిపారు. ఫ్రీ ప్రైమరీ విద్యార్థులు అందరూ తమ తల్లి దండ్రులను స్కూల్ కి తీసుకుని వచ్చి వాళ్ల స్కూల్ వాతావరణం, వారు తయారు చేసిన ప్రాజెక్ట్ పనులను చూపించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్నారు. చిన్నతనం నుండి తమ విద్యార్థులు అన్నింటి మీద పట్టు సాధించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని రీజినల్ ఇంఛార్జి నరేశ్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్స్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇంఛార్జి ప్రసన్న, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

➡️