అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పిడి యాక్ట్‌

May 26,2024 22:40

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-రామచంద్రపురం

రామచంద్రపురం, పామర్రు, ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రౌడీషీట్లు కలిగిన వారందరికీ పోలీసులు ఆదివారం కౌన్సిలింగ్‌ నిర్వహించారు. కౌంటింగ్‌ నేపథ్యంలో ఎటువంట చట్టవ్యతిరేక కార్యక్ర మాల్లో పాల్గొనకుండా, సత్ప్రవర్తన అలవర్చు కోవాలన్నారు. అలాకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే వారిపై నగర బహిష్కరణ, పిడి యాక్ట్‌లు అమలుచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డిఎస్‌పి. బి.రామకృష్ణ, సిఐ పి.దొర రాజు, ఎస్‌ఐ కె.సురేష్‌ బాబు, జి.సురేంద్ర, జానీబాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️