నూతన పెన్షన్లు పంపిణీ

Jan 8,2024 16:54 #Konaseema
pension release

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : కపిలేశ్వరపురం మండలంలోని వల్లూరు, వాకతిప్ప, కోరుమిల్లి, గ్రామాల్లో సోమవారం వైయస్సార్ నూతన పెన్షన్ల ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు దాసి మీనా కుమారి, కొరి పెల్ల వెంకట నాగ స్రవంతి, ఆచంట సత్యనారాయణ, అధ్యక్షతన జరిగిన నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో జడ్పిటిసి పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ,పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సామాజిక పెన్షన్లను రూ. 3 వేలు కు పెంచి ప్రజలకు అందజేస్తున్నారన్నారు . కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపుర పు శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ గుత్తుల గోవిందు, ఎంపీడీవో ఏం రామకృష్ణారెడ్డి ,మేడిశెట్టి దుర్గారావు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.

➡️