అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి

May 19,2024 21:03

నార్కేడిమిల్లి ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-ఆత్రేయపురం

ఇటీవల సుప్రీం కోర్టు, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యు నల్‌ జారీ చేసిన ఆదేశాల మేరకు అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులు ఆదేశించారు. ఆదివారం స్థానిక మండల పరిధిలోని నార్కేడిమిల్లి గ్రామంలో ఇసుక ర్యాంపును ఆయన అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ర్యాంపు ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా ఉండడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ర్యాంపుకు సంబంధించి సరిహద్దు లను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవా లని అధికారులు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఉసురుమర్రు, తీపర్రు ఇసుక రీచులు సరిహద్దులు దాటి నార్కెడిమిల్లి ఇసుక రీచ్‌ లోకి రాకుండా సరిహద్దులు ప్రతిష్టంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు ప్రస్తుతం రాంపులో ఎటువంటి ఇసుక ఆపరేషన్‌ లేవని, పోలీస్‌ అధికారులు రాత్రి సమయంలో అక్రమ ఇసుక తవ్వకాలకు ఎవరు పాల్పడకుండా పటిష్ట నిఘా ఉంచాలని అన్నారు. అదేవిధంగా స్థానికంగా నివసించేవారు తమ తమ గృహ నిర్మాణ అవసరాలకు ఇసుకను అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితులలోనూ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అక్రమ ఇసుక తవ్వకాలను నిలువరించాలనే సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు స్పష్టంగా ఉన్న దృష్ట్యా అధికారులు అక్రమ ఇసుక తవ్వకా లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. సహజ పర్యా వరణానికి నష్టం వాటిల్లకుండా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు అందితే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో త్వరలో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జిటి తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు ఆపే బాధ్య తలను ఈ కమిటీకి అప్పగించనున్నదని అన్నారు. ఈ కమిటీ క్రమం తప్పకుండా పర్యటించి అక్రమ తవ్వకాలు జరగకుండా పర్యవేక్షించనున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ వెంకట రామయ్య, జలవనరుల శాఖ, మైనింగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొ న్నారు.

➡️