మార్చి నెలలోనే మండిపోతున్న ఎండలు

Mar 30,2024 15:21 #Konaseema

నిర్మానుష్యంగా మెయిన్ రోడ్ లు

ప్రజాశక్తి-రామచంద్రపురం : వేసవి ముందే ఎండలు మారుతున్నాయి.దీనితో మద్యన సమయంలో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.మే నెల మాదిరిగా మార్చి లోనే ఎండలు బాగా పెరిగి 36 నుండి 38 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం ఉష్ణ తాపానికి తాళలేని జనం చెట్ల కిందకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు మరింత ఉష్ణోగ్రతలు మండిపోవడంతో ప్రయాణికుల సైతం ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఇక వేసవి తాపానికి కూల్ డ్రింకులు శీతల పానీయాలు షాపులు, జ్యూస్ సెంటర్లు ఊపందుకున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్ మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో అని సామాన్యులు భయపడుతున్నారు. అయితే ఎండ వేడిమికి తాళలేని వృద్ధులు మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఎండల వేడిమికి శరీరం నుండి కోల్పోయిన నీటిని భర్తీ చేసుకోవడం కోసం అధికంగా మంచినీరు సేవించాలని, నాలుగు దాటిన తర్వాత ప్రయాణాలు కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

➡️