నిండా నిర్లక్ష్యం 

Mar 13,2024 12:22 #Konaseema

ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెరిగిన తుప్పలు
పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
ప్రజాశక్తి-మండపేట  : మండలంలోని ఏడిద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న చెరువు గట్టు చెంతనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ తుప్పలు పెరిగిపోయి చిట్టి అడవిని తలపిస్తున్నాయి. అంతేకాకుండా విద్యుత్ తీగలకు పాదులు అలుముకుంటున్నాయి.
పొరపాటున విద్యుత్‌ వైర్లకు పాదుల తీగలకు తాకితే వాటి ద్వారా విద్యుత్‌ ప్రవాహం రావచ్చని పలువురు చెబుతున్నారు. అలుముకున్న పాదుల తీగలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు కోరుతున్నారు.

➡️