కుందూరులో క్షయ వ్యాధి దినోత్సవం

Mar 24,2024 11:56 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని కుందూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. టీబిని అరికట్టడం మన అందరి బాధ్యత అని క్షయ వ్యాధి ఒక అంటూ వ్యాధి అని దీని పట్ల ప్రవర్తన ఉండాలని ఆరోగ్య కేంద్రం వైద్యులు వైద్యులు డాక్టర్ నాయుడు తెలిపారు. రెండు వారాలకు మించిన జ్వరం దగ్గు కళ్ళు పడటం వంటివి టీవీ వ్యాధికి ప్రథమ లక్షణాలని ఆయన వివరించారు. వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా ఆరు నెలల మందులు వాడటం వల్ల దీనిని నివారించుకోవచ్చు అని మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మరింత త్వరగా తగ్గుతుందని దీనికి ప్రభుత్వం టీవీ రోగికి రూ 3000 జమ చేస్తుందని వివరించారు. 2025 నాటికి పూర్తిగా టీవీని తరిమికొట్టాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️