కొండూరు వెంకటేశ్వరరావు చిత్రపటం ఆవిష్కరణ

Apr 12,2024 23:08

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : గుంటూరు బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది, పూర్వ రిటైర్డ్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కొండూరి వెంకటేశ్వరరావు చిత్రపట ఆవిష్కరణను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ కొండూరు వెంకటేశ్వరరావు మంచి మనస్సు కలిగిన న్యాయవాది అని, ఆయన హైకోర్టులో రిజిస్ట్రార్‌గా పనిచేసే సయమంలో కూడా ప్రధాన న్యాయమూర్తికి ఎంతో మంచి సలహా ఇస్తూ అండగా ఉండే వారని అన్నారు. ఒక న్యాయవాది ఎలా ఉండాలి, ఒక న్యాయమూర్తి ఎలా ఉండాలనే విషయాన్ని కొండూరు వెంకటేశ్వరరావును చూసి జూనియర్‌ న్యాయవాదులు తెలుసుకోవచ్చన్నారు. ఒక నిజమైన కక్షిదారునికి కేసు గెలిపించటానికి ఆయన శాయశక్తులా కృషి చేసే వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవిఎస్‌బిజి పార్థసారధి, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి, సీనియర్‌ న్యాయవాది చంద్రమౌళేశ్వరరావు, కొండూరు వెంకటేశ్వరరావు వద్ద జూనియర్‌గా పనిచేసిన ఎస్‌.వై.ఏడుకొండలు, సీనియర్‌ న్యాయవాదులు, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️