డోకిపర్రులో వేడుకగా ధ్వజారోహణం

Dec 25,2023 22:56

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు

మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి, సుధారెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యాత్రికులతో పాటు నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతులు, ప్రసన్న పాల్గొన్నారు. ధ్వజారోహణ అనంతరం యాత్రికులకు గరుడ ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిఉత్సవ విగ్రహాన్ని సూర్యప్రభ వాహనంలో ఆలయ మండపానికి తీసుకువచ్చారు. యాత్రికుల దర్శన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి డోకిపర్రు గ్రామంలో శేష, హంస వాహనాల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గజ వాహనోత్సవం, విశేష తిరుమంజనం, రథోత్సవం, ఊంజల సేవ, గరుడోత్సవం, ఆస్థానం, ఏకాంత సేవలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

➡️