కృష్ణాలో 31 నామినేషన్లు

Apr 22,2024 23:46

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ నాలుగవ రోజు మొత్తం 31 నామినేషన్లు దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డికె.బాలాజీ తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సింహాద్రి చంద్రశేఖర రావు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, గూడవల్లి వెంకట కేదారేశ్వర రావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, దేవమణి దేవరపల్లి బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. సోమవారం మొత్తం ముగ్గురు అభ్యర్థులు బందరు పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారన్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గన్నవరం అసెంబ్లీ స్థానానికి కలపర్తి భాస్కరరావు, జై భీమ్రావు భారత్‌ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, కొర్రపోలు శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు.గుడివాడ అసెంబ్లీ స్థానానికి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2 సెట్ల నామినేషన్లు, కొడాలి నాగేశ్వరరావు చిన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2 సెట్ల నామినేషన్లు, నల్లగంచు వెంకట రాంబాబు, జాతీయ జనసేన పార్టీ తరపున ఒక నామినేషన్‌, రేమల్లి నీలకాంత్‌, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, రాము వెనిగండ్ల, టిడిపి తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.హేమంత్‌ కుమార్‌ అల్లూరి, జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. అలాగే పెడన అసెంబ్లీ స్థానానికి జమదగ్ని రాజులపాటి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, సేనాపతి గోపి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, సొంటి నాగరాజు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒక సెట్‌ నామినేషన్‌, కాగిత కష్ణ ప్రసాద్‌, టిడిపి తరఫున ఒక సెట్‌, కాగిత శిరీష టిడిపి తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, పత్రాలను దాఖలు చేశారు.ఈడే కాశీ విశ్వేశ్వరరావు బహుజన్‌ సమాజ్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు.మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పేర్ని వాకా సాయి కష్ణ మూర్తి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, సౌదాడ బాలాజీ, బహుజన సమాజ్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, చితపల్లి మనోహర్‌, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, కోన నాగార్జున, భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి బుద్ధ ప్రసాద్‌ మండలి జనసేన పార్టీ తరఫున 2 సెట్ల నామినేషన్లు వేశారు.పామర్రు అసెంబ్లీ స్థానానికి అనిల్‌ కుమార్‌ కైలే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, జ్ఞానమణి కైలే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, బాబు రాజేంద్రప్రసాద్‌ రాయవరపు, బహుజన సమాజ్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. పెనమలూరు అసెంబ్లీ స్థానానికి పచ్చిపాల కనక దుర్గారావు, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, రాము గోగం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, సోము మహేశ్వరరావు, బహుజన సమాజ్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను ఆయ నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.కొడాలి, వెనిగండ్ల నామినేషన్లు దాఖలుప్రజాశక్తి-గుడివాడ: సోమవారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయంలో గుడివాడ వైసిపి అభ్యర్థిగా కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని), తన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు(చిన్ని), పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను, సీనియర్‌ నాయకులు మండలి హనుమంతరావు, బూసి ప్రకాష్‌, పాలేటి చంటిలతో ఒక సెట్టు నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారిణి పి పద్మావతికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా వెనిగండ్ల రాము తన నామినేషన్‌ పత్రాలను ఆయన సతీమణి వెనిగండ్ల సుఖదా సోమవారం ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. స్ధానిక ఆర్‌.డి.ఓ. కార్యాలయంలో ఎన్నికల అధికారిణి పి పద్మావతికి టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము తరుపున ఆయన భార్య సుఖదా, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. పెడన: పలు పార్టీల నాయకుల నామినేషన్‌ ప్రక్రియ కోలాహలంతో తాసిల్దార్‌ కార్యాలయం సోమవారం కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ అభ్యర్థిగా సొంటి నాగరాజు, టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌, రాజులపాటి జమదగ్ని ఇండిపెండెంట్‌, ఈడే కాశీ విశ్వేశ్వరరావు బహుజన సమాజ్‌వాది పార్టీ తరపున నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి వెంకట రామయ్య నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. అవనిగడ్డ : జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. బుద్ధ ప్రసాద్‌ ఆయన సతీమణి విజయలక్ష్మితో కలిసి తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. వైసిపి బందరు పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రమేష్‌ బాబు తనయుడు వికాస్‌ బాబు చంద్రశేఖర్‌ తనయుడు రామ్‌ చరణ్‌ లతో కలిసి ప్రజలకు అభివాదం చేసుకుంటూ నామినేషన్‌ వేసేందుకు వెళ్లారు. గన్నవరం: గన్నవరంలో బిజెపి రెబల్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా బిజెపి మాజీ అసెంబ్లీ కన్వీనర్‌, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు కొర్రప్రోలు శ్రీనివాసరావు సోమవారం నామినేషన్‌ వేశారు. ఇద్దరు ప్రతిపాదలతో నామినేషన్‌ పత్రాలను ఆర్వో గీతాంజలి శర్మకు అందజేశారు. జై భీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ కి కలపర్తి భాస్కరరావు, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా (బిజెపి) కె.శ్రీనివాసరావు నామినేషన్‌ వేశారు.

➡️