అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి

Apr 20,2024 23:07

ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్‌

అగ్ని ప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి గరికపాటి రామ్మోహన్రావు అన్నారు.మండల కేంద్రమైన బాపులపాడులోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, తాసిల్దార్‌ కార్యాలయం సిబ్బందికి శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఫ్కైర్‌ఆఫీసర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతమైన చర్యలు ప్రశంసనీయమన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయని, పెట్రోలు, బంకులు, పాఠశాలలు, అపార్టుమెంటులు పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. అగ్నిప్రమాదాల్లో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా అగ్నిపమాక సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఎక్కడైనా అగ్నిప్రమాదాలు సంభవిస్తే, వెంటనే అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అగ్నిమాపక పరికరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో లీడింగ్‌ ఫైర్మెన్‌ సం జీవ్‌ కుమార్‌, డీఓపీ సాంబశివరావు, ఫైర్మెన్‌ మురళి, శ్యాంబాబు, కృష్ణసాగర్‌, నాగార్జున, దుర్గాప్రసాద్‌, అబ్దులై తదితరులు పాల్గొన్నారు.

➡️