కెయు కార్మికులకు వేతనాలు అమలు చేయాలి : సిఐటియు

Apr 19,2024 23:33

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌

కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న డైలీ వేజ్‌ ఉద్యోగులను స్కిల్డ్‌ (డిగ్రీ, డిప్లొమో ఆపైన ) సెమిస్కిల్డ్‌ (ఇంటర్‌, ఐటిఐ) అన్‌ స్కిల్డ్‌ వర్కర్స్‌గా వర్గీకరించి వేతనాలు అమలు చేయాలని ఆల్‌ యూనివర్సిటీస్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కృష్ణా యూనివర్సిటీ పరిపాలనాధికారులైన ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి, రిజిస్ట్రార్‌ కె.శోభన్‌బాబులకు యూనియన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న డైలీ వేజ్‌ ఉద్యోగులకు రాష్ట్రంలో ఉన్న ఇతర యూనివర్సిటీలో అమలవుతున్న ప్రకారం సంవత్సరానికి 12 క్యాజువల్‌ లీవులు, నెల మొత్తానికి జీతం, ఈఎస్‌ఐ, ఇపిఎఫ్‌ వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైలీ వేజ్‌ ఉద్యోగుల కష్ణా యూనివర్సిటీ కమిటీ గౌరవ అధ్యక్షులు బూర సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు బి. శ్రీరామ్‌ ప్రసాద్‌, జనరల్‌ సెక్రెటరీ జి వీరబాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, పి జ్యోతి, జాయింట్‌ సెక్రెటరీ వి శ్రీనివాస్‌, ట్రెజరర్‌ కె రవికుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ బి శ్రీనివాసరావు,కె నాగేశ్వరరావు, వి.సాయి రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రాజేష్‌, పట్టణ అధ్యక్షులు ఎంఏ బెనర్జీ, శరత్‌ కుమార్‌, పౌర సంక్షేమ సంఘం నాయకులు కొడాలి శర్మ మద్దతు తెలిపారు.

➡️