కోలాహలంగా కోడి పందాలు 

Jan 15,2024 16:12 #Krishna district
cock fight in challapalli

ప్రజాశక్తి-చల్లపల్లి: సంక్రాంతి పండుగ సాంప్రదాయం ముసుగులోగత రెండురోజులుగా కోడిపందాలు కోలాహలంగా సాగుతున్నాయి. చల్లపల్లి మండలంలో కృష్ణానదీ తీరంలో అవనిగడ్డ విజయవాడ కరకట్ట ప్రక్కన వెలివోలులో జరుగుతున్న కోడిపందాలలో లక్షలాది రూపాయలు లావాదేవీలు జరిగినట్లు ప్రచారం జరుగుతుందన్నది . కేవలం కోడి పందాలుకాకా ఇతర జూద క్రీడల నిర్వహణకు విస్త్రుతంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు నిర్భీతిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. జూద క్రీడలు నిర్వహిస్తే ఉక్కు పాదం మోపుతామ్మన్న అధికారులు ఏమి చర్యలు తీసుకొన్నారో, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఏమి స్వాధీనం చేసుకున్నారు అనేది ప్రసన్నార్ధకం.

➡️