విద్యుత్‌ శాఖ ఉద్యోగిపై ఫిర్యాదు

Apr 13,2024 23:14

ప్రజాశక్తి – అవనిగడ్డ : ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ వైసిపి కార్యకర్తగా పనిచేస్తున్న విద్యుత్‌ శాఖలోని షిఫ్ట్‌ ఆపరేటర్‌ గరికపాటి రాకేష్‌ని ఉద్యోగం నుండి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. శనివారం అవనిగడ్డ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రిటర్నింగ్‌ అధికారిని కలిసి ఎపి సీపీడీసీఎల్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ వైసిపి పార్టీకి సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నాడని రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉన్నప్పటికీ ఫేస్బుక్లో వికాస్‌ అన్న అభిమాని అనే పేరుతో ఖాతాను ప్రారంభించి తమ నేత మండలి బుద్ధ ప్రసాద్‌పై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు దీనికి సంబంధించిన ఆధారాలను ఫొటోలతో సహా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందించారు. ఫిర్యాదు చేసిన వారిలో షేక్‌ బాబావాలి మేడికొండ విజరు కంచర్ల ఆనంద్‌, మెగావత్‌ గోపి, గుంటూరు వినరు, లింగం బాబురావు, చెన్ను బాబురావు కొల్లూరి వాసు కైతేపల్లి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️