తాగునీటి కోసం గ్రామస్తుల ఆందోళన

Apr 22,2024 23:42

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు

మండలంలోని కవుతరం గ్రామపంచాయతీ కుళాయిలద్వారా అందించాల్సిన తాగునీరు గత రెండు రోజులుగా సరఫరా కావడం లేదు. దీనికి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కవుతరం ఒకటో వార్డు మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. గ్రామ కార్యదర్శి ఉమామహేశ్వరరావు ని తాగునీరు ఎప్పుడు అందిస్తారని వివరణ కోరగా మోటర్‌ రిపేరు వచ్చిందని దానికి కారణంగా నీరు సరఫరా చేయలేక పోయామని అన్నారు. గురువారానికి నీటి సరఫరాను అందిస్తామని అన్నారు. గురువారానికి స్వచ్ఛమైన ఫిల్టర్‌ చేసిన తాగునీటిని అందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️