ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర

Apr 18,2024 23:16
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్‌

ప్రజాశక్తి-ఉంగుటూరు

ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కుట్ర చేస్తున్న బిజెపిని దానికి వంత పాడే పార్టీల ఓటమే లక్ష్యంగా వ్యవసాయ కార్మికులు ఓటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.పవన్‌కుమార్‌ కోరారు. గురువారం మండలంలోని వేంపాడు, నందమూరు ,గ్రామాల్లో ఉపాధి కూలీలను పని ప్రదేశాల్లో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు 2004లో వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపిఎ 1 ప్రభుత్వం తో కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా (కామన్‌ మినిమం ప్రోగ్రాం) ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, సమాచార హక్కు చట్టం లాంటి వాటిని సాధించగలిగామని అన్నారు. అలాంటి ఉపాధిహామీ చట్టానికి మూడు లక్షల కోట్లు ఖర్చు చేయవలసి ఉండగా నామమాత్రంగా 86 వేల కోట్లు మాత్రమే కేటాయించి దేశంలో ఉన్న కోటి ఇరవై లక్షల మంది కూలీలను దగాచేస్తున్న బిజెపి కి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ చట్టం అమలులో ఉంది కనుక గ్రామాలలో వలసలు ఆగాయని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించుకోగలుగుతున్నామని ఇలాంటి చట్టానికి అండగా నిలబడి పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అజ్మీరా వెంకటేశ్వరరావు, సంస్థను, సామ్రాజ్యం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ రూరల్‌: ఉపాధి కూల పని దినాలు పెంచి వేతనం రూ.600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు పి.రజని డిమాండ్‌ చేశారు. గురువారం చౌటపల్లిలో ఉపాధి కూలీలు పని చేసే ప్రాంతాన్ని ఆమె పరిశీలించి వారితో మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని చేసే ప్రాంతంలో టెంట్లు, మంచినీరు, మజ్జిగ, ఎమర్జెన్సీ కిట్లు ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ బడ్జెట్లో ఏడాది ఏడాది నిధులు తగ్గిస్తుందని, వారం వారం కూలీలకు వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో పోరాటం ద్వారా ప్రభుత్వం దిగి వచ్చేటట్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరమ్మ, నాగలక్ష్మి, సుబ్బమ్మ, శ్రీనివాసు, రమేషు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️