చండ్ర రాజేశ్వరరావు వర్థంతి

Apr 9,2024 22:51

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేత సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతిని మంగళవారం స్థానిక మోదు మూడి శ్రీహరి రావు భవన్‌ సిపిఐ పార్టీ కార్యాలయంలో బందరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నియోజకవర్గ కార్యదర్శి లింగం ఫిలిప్‌ పూలమాలవేసి మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు విద్యభ్యాసము నుండే నాయకత్వ లక్షణాలతో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నరన్నారు. జిల్లా కార్యదర్శి రాష్ట్ర , జాతీయ కార్యదర్శి స్థానానికి ఎదిగారని గుర్తు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ చల్లపల్లి జమిందారు బంజర భూములను పేదలకు ఇప్పించడం లోను అలుపెరగని పోరాటం చేశారన్నారు. సిపిఐ పార్టీ సీనియర్‌ నాయకులు మోదుమూడి రామారావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీపై నిషేదం ఉన్న రోజుల్లో జైలు జీవితం గడిపారన్నారు.అనేక ఉద్యమాల్లో పాల్గొని పార్టీ క్రమశిక్షణకు నిర్మాణానికి ఎంతో కషి చేశారన్నారు. చివరకు తన ఆస్తిని కూడా పార్టీకి ఇచ్చిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి ఒంటి పులి లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తురక లక్ష్మణరావు, ఆర్టీసీ కార్గో యూనియన్‌ నాయకులు వెంకటేశ్వరరావు, హసీన్‌ పాల్గొన్నారు.

➡️