వృత్తి విద్యా కోర్సుల ద్వారా ఉపాధి

Apr 4,2024 12:18 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : వృత్తి విద్య కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చని జిల్లా బాలికా అభివృద్ధి అధికారిని హెచ్ వనిత కోరారు. మండలంలోని కవుతరం కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వృత్తి విద్య కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుండి 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు వృత్తివిద్య కోర్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బివిఎన్ఎల్ పద్మావతి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులైన ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. కావున గ్రామీణ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులు ఈ కోర్సులను సద్వినియోగపరుచుకుని తద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చు అని ఆమె కోరారు.

➡️