గ్రామీణ సమ్మెలో భాగంగా ర్యాలీ 

Feb 16,2024 12:14 #ntr district

ప్రజాశక్తి – రెడ్డిగూడెం: దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో భాగంగా రెడ్డిగూడెం మండల కేంద్రంలో రైతులు, కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షులు కొండపల్లి పరమేశ్వరరావు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది . ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యం మాధవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి నల్ల చట్టాలు తీసుకురావడం జరిగిందని ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయటం, కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్లకు దోచిపెట్టడం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడవర్తి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, బాబు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️