ఆరో రోజు 57 దాఖలు

Apr 24,2024 23:33

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ 6వ రోజు బుధవారం మొత్తం 57 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పరిటాల వెంకట ఫణి బాబు, జై భీమ్రావు భారత్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, వల్లభనేని బాలశౌరి, జనసేన పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు, గొల్లు కృష్ణ, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ఒక సెట్‌ నామినేషన్‌, భాస్కర్‌ రావు సైకం, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, గాంధీ ధనేకుల, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.గన్నవరం అసెంబ్లీ స్థానానికి వల్లభనేని వంశీ మోహన్‌, వైఎస్‌ఆర్సిపి, ఒక సెట్‌ నామినేషన్‌, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, వల్లభనేని మోహన్‌ వంశీకష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, సర్నాల విజయదుర్గ, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, శివ దుర్గ వరప్రసాద్‌ కొనగల, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, వెంకట్రావు యార్లగడ్డ, టిడిపి తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, రవీంద్ర కుమార్‌ పొట్లూరి రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(అధవాలే) తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, శ్రీదేవి పొట్లూరి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, తాడంకి జగదీష్‌ రామచంద్రరావు, తెలుగు రాజాధికార సమితి పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, దాఖలు చేశారు అలాగే గుడివాడ అసెంబ్లీ స్థానానికి సింగవరపు జోసెఫ్‌, జై భీమ్రావు భారత్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, పంది నాగార్జున, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, అంబేద్కర్‌ గుండాబత్తిన, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, ఏచూరి వేణుగోపాలరావు, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, మీగడ రాము, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, దాఖలు చేశారు.పెడన అసెంబ్లీ స్థానానికి కాగిత కష్ణ ప్రసాద్‌, టిడిపి ఒక సెట్‌ నామినేషన్‌, కాగిత శిరీష టిడిపి ఒక సెట్‌ నామినేషన్‌, రమేష్‌ ఉప్పాల(రాము), వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2 సెట్ల నామినేషన్లు, హారిక ఉప్పాల, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మూడు సెట్ల నామినేషన్లు, దాఖలు చేశారు మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి కొల్లు రవీంద్ర, టిడిపి 3 సెట్ల నామినేషన్లు, కొల్లు నీలిమ, టిడిపి మూడు సెట్ల నామినేషన్లు, సౌదాడ బాలాజీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, అబ్దుల్‌ మతీన్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, దాఖలు చేశారు అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి శ్రీరామ మూర్తి అందే, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండు సెట్ల నామినేషన్స్‌, అందే శ్రీవాణి, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, సముద్రాల అంబేద్కర్‌, జై భీమ్‌ రావు భారత్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, రమేష్‌ బాబు సింహాద్రి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండు సెట్ల నామినేషన్లు, వికాస్‌ సింహాద్రి, వైఎస్‌ఆర్సీపీ, ఒక సెట్‌ నామినేషన్‌, మండలి వెంకట్రావు, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, దాఖలు చేశారు.పామర్రు అసెంబ్లీ స్థానానికి వర్ల కుమార్‌ రాజా, టిడిపి, ఒక సెట్‌ నామినేషన్‌, జ్ఞానమణి కైలే, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, కొడాలి సునీల జై భీమ్రావు భారత్‌ తరపున ఒక సెట్‌ నామినేషన్‌, దొవారి ఏసుదాస్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ఒక సెట్‌ నామినేషన్‌, దొవారి అమర్నాథ్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ఒక సెట్‌ నామినేషన్‌, పత్రాలు అందించారు.పెనమలూరు అసెంబ్లీ స్థానానికి సతీష్‌ జొన్నలగడ్డ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌, మరదాని విజ్జయ్య, జై మహాభారత్‌ పార్టీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌, జోగి రమేష్‌, వైసిపి తరఫున నాలుగు సెట్ల నామినేషన్లు, జోగి రాజీవ్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండు సెట్ల నామినేషన్లు, బోడె ప్రసాద్‌, టిడిపి, ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

➡️