టిడ్కో రుణాలు మాఫీ చేయాలి

Mar 30,2024 13:06 #Krishna district

ప్రజాశక్తి-గుడివాడ: టిడ్కో 650 కోట్లు రుణమాఫీ చేస్తామని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని కోరుతూ పోరాటం ఉదృతం చేస్తామని  టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ప్రకటన తెలిపింది. స్థానిక సి.పి.ఎమ్.కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన పత్రికవిలేకరుల సమావేశంలో టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ 2018 ఎన్నికల సభలో వై.ఎస్.జగన్ నెహ్రూచౌక్ లో జరిగిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే టిడ్కో లబ్దిదారులందరికి 3 లక్షలు అసలు అప్పు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని, నెలకు మూడు వేలు చొప్పున 20 ఏళ్ళు అప్పు కట్టలేరని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికార పార్టీ మాటమార్చి లభిదారులు డబ్భులు చెల్లించాలని చెప్పడం, పరోక్షంగా బ్యాంకుల ద్వారా వత్తిడి చేయించడం ప్రజలను మోసం చెయ్యటమేనని విమర్శించారు. ఇప్పటికైన వెంటనే స్పందించి రుణమాఫీ 2024 ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. టిడిపి పార్టీ కూడా తమ మ్యానిఫెస్టోలో పెట్టలేదని గుర్తు చేశారు. వారుపెట్టకపోతే టిడ్కో కాలనీ వార్డు పోరాట కమిటీలను, టిడ్కో కాలనీ బ్లాక్ కమిటీలను సమీకరించి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అధ్యక్షురాలు ఆర్.సంగమ్మ మాట్లాడుతూ ఋణమాఫి జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదని హెచ్చరించారు.ఉపద్యక్షురాలు మద్దెల దుర్గ మాట్లాడుతూ ఋణమాఫి చేసే సత్తా ఉన్నపార్టీలు మాత్రమే తమ దగ్గరకు వచ్చి ఓట్లు అడగాలని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాలేపు దుర్గ, అధికారుల ఆదినారాయణ, టి.అప్పల నాయుడు, కె.సురేష్,మాధవి,షైక్ గౌస్ పీరా, అరెపల్లి జానకి, రూపా, హైమవతి, ఎండి.నూరున్నిసా, బి.మేరమ్మ, పావని, వెలమల సరళ, ఎమ్.నాగేశ్వరరావు, షైక్ సలీమున్నిసా, ఆర్.శివరాం ప్రసాద్, పార్వతి, లక్ష్మీ, హరి, తదితరులు పాల్గొన్నారు

➡️