విజిలెన్స్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

Apr 16,2024 23:11
  • కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి బాలాజీ

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా విజిలెన్స్‌ బందాల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు,జిల్లా స్థాయి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో స్పందన మీటింగ్‌ హాల్లో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.ఎన్నికలలో వివిధ శాఖలతో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి విజిలెన్స్‌ బందాలు ఒకే టీం గా భావించి టీం స్పిరిట్‌ తో పనిచేయాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు కషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా విజిలెన్స్‌ బందాలు అప్రమత్తంగా వ్యవహరించి మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలను నియంత్రించాలని, అక్రమ రవాణా అరికట్టాలని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌ కు 48 గంటల ముందు డ్రై డే పటిష్టవంతంగా అమలు చేయాలని అన్నారు. ఎస్‌ ఈ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిష్పక్షపాతంగా సీజ్‌ చేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అందుబాటులో గల పోలీస్‌ దళాలు, ఇంకా అవసరమైన పోలీస్‌ ఫోర్స్‌ గురించి కలెక్టర్‌ సమీక్షిస్తూ ఎన్నికల నిబంధనల మేరకు ఎన్‌ సి సి, ఎన్‌ఎస్‌ఎస్‌, పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల సేవలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్నికలలో కమ్యూనికేషన్‌ ప్రణాళిక సమీక్షించిన కలెక్టర్‌ అందుబాటులో గల వైర్లెస్‌ సెట్లు, ఇంకా అవసరమైన సెట్స్‌ సమకూర్చుకొనుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు గుర్తించిన రూట్లు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, షాడో టీమ్స్‌ ఏర్పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఎన్నికలలో డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలను అరికట్టుటకు, ప్రత్యేక దష్టి సారించాలన్నారు.నేషనల్‌ డేటా బేస్‌ ఫర్‌ ఆర్మోడ్‌ లైసెన్స్‌ అనుసరించి జిల్లాలో లైసెన్సుడ్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకుని, చట్టబద్ధం కాని ఆయుధాలు లేకుండా నియంత్రించాలన్నారు. ఎన్నికలలో హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా రౌడీ షీటర్‌ లను నిష్పక్షపాతంగా బైండోవర్‌ చేయడంతో పాటు నిబంధనల మేరకు వారి నుండి నిర్దేశించిన మొత్తానికి సెక్యూరిటీ బాండ్‌ తీసుకోవాలన్నారు. ఎక్కడా రీ పోలింగ్‌ కు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, గన్నవరం రిటర్నింగ్‌ అధికారి గీతాంజలి శర్మ మాట్లాడుతూ ఎఫ్‌ ఎస్‌ టి, ఎస్‌ ఎస్‌ టి బందాల వాహనాలకు జిపిఎస్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు ఈ బందాల చర్యలను ఫిర్యాదుల పరిష్కార కేంద్రం నుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సి విజిల్‌ ద్వారా గాని, ఇతర విధాలలో ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలన్నారు.డి ఆర్‌ వో కే చంద్రశేఖర రావు మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పటిష్టవంతమైన డిస్ట్రిక్ట్‌ ఎఫ్‌. ఎస్‌. టి. టీము ఏర్పాటు చేశారని, ఎక్కడ ఏ ఫిర్యాదు అందిన తక్షణమే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 18 నుండి నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయని, నామినేషన్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద భద్రత చర్యలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి జి వెంకటేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఎం వాణి, పి పద్మావతి, డి రాజు, పి వెంకటరమణ, శ్రీదేవి, బాలసుబ్రమణ్యం, పోలీస్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌, ఇన్కమ్‌ టాక్స్‌, కమర్షియల్‌ టాక్స్‌ తదితర శాఖలకు సంబంధించి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు పాల్గొన్నారు.

➡️