నిరుపయోగంగా ‘చెత్త’ సంపద కేంద్రాలు

Apr 9,2024 22:48

ప్రజాశక్తి-గన్నవరం

మండల పరిధిలో 21 గ్రామ పంచాయతీలో చెత్త నుండి సంపద కేంద్రాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. నిధులు మంజూరు చేసింది. రూ.6 లక్షల నుండి 13 లక్షలు వరకు ఖ ర్చు చేస్తోంది. గన్నవరం మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో వీటి నిర్మా ణానికి నిధు లు మంజూరు చేశారు. గన్నవరం, బుద్దవరం, కేసరపల్లి, ముస్తాబాద మేజర్‌ పంచాయతీలు న్నాయి. వీటిలో సంపద కేం ద్రాలకు నిధులు మంజూరు చేశారు. కేసరపల్లిలో 13 లక్షలతో నిర్మాణం చేయగా, మిగిలిన చోట్ల 3 నుండి 6 లక్షలతో కేంద్రాలునిర్మాణం చేశారు. మొత్తం వీటి నిర్మాణానికి రూ.1.80 కోట్లు ఖ ర్చు చేశారు. గన్నవరం, కేసరపల్లి, సావరగూడెం సహా 15 పంచాయతీల్లో కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాంది. గన్నవరంలోని కేంద్రం నిరుపయోగంగా మారింది. చెత్త నుండి సందప రావడం లే దు. నిర్మించిన కేంద్రం శిధిలావస్థకు చేరుకుంది. కానీ ఇంత వరకు వినియోగంలోకి రాలేదు. నాలుగు రోజుల కంపోస్టు ఎరువు తయారు చేసి సరిపెట్టారు. తర్వాత దీనిని పట్టించుకున్న నాధుడు లేరూ.3 లక్షల వ్యయంతో తాటా కులో పైకపు వేసి దీనిని నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. ఈదురు గాలులకు తాటాలకులులేచిపోయాయి. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో శిధిలావస్థకు చేరుతుంది. తలుపులు చెదలు పట్టి ఊడిపోయాయి. ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన కేంద్రం అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా తయారైంది.కేసరపల్లిలో సంపద కేంద్రం రేకుల షెడ్డుతో కట్టినా ఉపయోగం లోకి తీసుకురావడంలో అధికారులు పట్టించుకోవడంలేదని అంటున్నారు. రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన దీనిని అందుబాటులోకి తీసుకురావడం లేదు. చెత్తను తీసుకొచ్చి తగులబెడుతున్నారు. రహదారిపై వెళ్లే వారికి అసౌకర్యం కలుగుతోంది. ఇదిలా ఉంటే సారవగూడెం కేంద్రం నిరుపయోగంగా ఉంది. మిగతాపంచాయతీ నిర్మాణాలు పూర్తయినా ప్రారంభించకపోవడంపట్ల జనాలు నిరసన తెలిపారు. కొన్ని చోట్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. దీంతో పంచాయతీల్లో ఎక్కడ చూసినా చెత్త సమస్యే కనిపి స్తోంది. అందుబాటులో సంపద కేంద్రాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదో తెలియడం లేదు. లక్షలు వ్యయం చేసి లక్ష్యాన్ని గాలికి వదిలేశారని జనాలు మండిపడుతున్నారు. చెత్తను ఎక్కడ పోసి నిప్పు పెడుతున్నారు. దీంతో పొగ, విషయవాయువులతో ఇబ్బందులు పడుతున్నారు. సంపద మాట పక్కన పెడితే కనీసం చెత్త ను లేకుండా చేయాలనే ఆలోచనకు విఘాతం కలుగుతోంది. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి చెత్త నుండి సంపద కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

➡️