కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు

Mar 1,2024 20:57

మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న తిక్కారెడ్డి

– మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
– టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి
ప్రజాశక్తి – మంత్రాలయం
టిడిపి కార్యకర్తల అకాల మృతి పార్టీకి తీరని లోటని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. శుక్రవారం మృతదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోసిగిలోని సీనియర్‌ నాయకులు కోతుల తిక్కస్వామి, మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో మఠం చెన్నయ్య స్వామి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తిక్కారెడ్డి ఆయా గ్రామాలకు చేరుకుని మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. రెండు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేశారు. టిడిపి మండల నాయకులు కృష్ణ మోహన్‌ రెడ్డి, మారెప్ప ఉన్నారు.

➡️