టిడిపితోనే రాష్ట్ర భవిష్యత్తు

Jan 5,2024 20:41

మాజీ ఎమ్మెల్యే బీవీకి సమస్య తెలుపుతున్న ప్రజలు

– మాజీ ఎమ్మెల్యే బీవీ
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
టిడిపితోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ’లో భాగంగా పట్టణంలోని 27, 29, 21, 19వ వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డుల్లోని టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోవు రోజుల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి రచ్చబండ ద్వారా ప్రజావేదిక నిర్వహించి ప్రజలకు వివరించారు.

➡️