తాగు నీటి వృథాను అరికట్టాలి

Jan 10,2024 20:31

పైపు లీకేజీని చూపుతున్న నాయకులు

– సిపిఎం, సిపిఐ నాయకులు
ప్రజాశక్తి – ఆదోని
ఆదోనిలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు తాగునీటి పైపులైను లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని సిపిఎం, సిపిఐ పట్టణ కార్యదర్శులు లక్ష్మన్న, సుదర్శన్‌, నాయకులు వీరేష్‌, గోపాల్‌, విజరు, తిప్పన్న, రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. బుధవారం పైపులైను లీకేజీ ప్రాంతంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ… కొన్ని రోజులుగా పైపు లీకేజీ అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని తెలిపారు. ఇప్పటికే శివారు కాలనీలో తాగునీరు వారానికోసారి కూడా సరఫరా కావడం లేదన్నారు. నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే పాత పైపులైను స్థానంలో కొత్త పైపు లైను వేయాలన్నారు.

➡️