దేవనకొండలో దొంగతనం

Jan 6,2024 20:04

చోరీ జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న ఎస్‌ఐ, డాగ్‌ స్క్వాడ్‌

– 8 తులాల బంగారు, 40 తులాల వెండి, రూ.29,500 నగదు చోరీ
ప్రజాశక్తి – దేవనకొండ
దేవనకొండలోని మాల వీధిలో ఆర్‌టిసి డ్రైవర్‌ మజీద్‌ ఇంట్లో శనివారం దొంగతనం జరిగింది. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా తెరిచి రూ.29,500 నగదు, 8 తులాల బంగారు, 40 తులాల వెండిని అపహరించారు. పోలీసుల వివరాల మేరకు… చోరీకి గురైన ఇంట్లోని మహిళ పక్కింటి ఇంట్లోకి ఇంటి తలుపులు వేసి వెళ్లారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించి తాళాలు వేసిన బీరువాను తెరిచి దొంగతనానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇంటిని ఎస్‌ఐ భూపాలుడు, పోలీసు సిబ్బంది పరిశీలించారు. దొంగల ఆచూకీ తెలుసుకోవడానికి క్లూస్‌ టీం డాగ్‌ స్క్వాడ్‌ రప్పించారు. చోరీ జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

➡️