‘నారాయణ’లో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

Dec 23,2023 19:48

క్రిస్మస్‌ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
పట్టణంలోని నారాయణ పాఠశాలలో శనివారం ఎజిఎం రమేష్‌, రీజినల్‌ ఇన్‌ఛార్జీ కొండల్‌రావు, ప్రిన్సిపల్‌ ఎమ్‌డి.జాఫర్‌, జోనల్‌ ఇన్‌ఛార్జీ శ్రీలక్ష్మి, ఈ-చాంప్స్‌ ఇన్‌ఛార్జీ కృష్ణవేణి ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ జాఫర్‌, ఈ-చాంప్స్‌ ఇన్‌ఛార్జీ కృష్ణవేణి మాట్లాడారు. ఏసుక్రీస్తు జన్మదినం రోజున క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని చెప్పారు. క్రీస్తు చూపిన బాటలో అందరూ నడవాలని కోరారు. ఏసు జననం ప్రపంచానికి ఒక మార్గదర్శనమని, ఆయన అడుగుజాడల్లో నడిచి శాంతికి చిహ్నంగా విద్యార్థులు నిలవాలని కోరారు. విద్యార్థుల క్రిస్మస్‌ తాత వేషధారణ, క్రిస్మస్‌ ట్రీ ఆకట్టుకున్నాయి. ఎకిడ్జ్‌ ఇన్‌ఛార్జీ జెబా, డీన్‌ వీరేష్‌, ఎఒ రాజేంద్ర పాల్గొన్నారు.

➡️