మాటను నిలబెట్టుకునే నాయకుడు జగన్‌

Jan 6,2024 20:09

కౌతాళంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

– అబద్ధాలు చెప్పి మోసం చేసే నాయకుడు చంద్రబాబు
– ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ప్రజాశక్తి – కౌతాళం
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని, అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసే నాయకుడు చంద్రబాబు అని, ప్రజలు ఇది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో పింఛన్ల పంపిణీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి చెందుతుందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. రాంపురం రెడ్డి సోదరుల కుటుంబం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు వైసిపి మండల కన్వీనర్‌ దేశాయి ప్రహ్లాద చారి, ఉరుకుంద ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ నాగరాజు గౌడ్‌, సీనియర్‌ నాయకులు లక్ష్మారెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు మాబు సాబ్‌, మాజీ సర్పంచి అవతారం కొనియాడారు. అనంతరం నూతనంగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు. ఎంపిపి అమ్రేష్‌, వైస్‌ ఎంపిపి బుజ్జిస్వామి, సర్పంచి పాల్‌ దినకరన్‌, వైస్‌ సర్పంచి తిక్కయ్య, నాయకులు గురునాథ్‌ రెడ్డి, సర్పంచులు గోపాల్‌ రెడ్డి, మహేష్‌, తోవి నరసప్ప పాల్గొన్నారు.

➡️