వన్య ప్రాణులను సంరక్షించాలి

Dec 18,2023 19:37

సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

– ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ
ప్రజాశక్తి – ఆదోని
వన్యప్రాణులను సంరక్షించాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ నాయకులు కోరారు. సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందనలో సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. సభ్యులు ఆర్‌.దేవి ప్రసాద్‌, జైభీమ్‌ జాతీయ నాయకులు జైభీమ్‌ సాయిరాం మాట్లాడారు. ఎమ్మిగనూరు, ఆదోని మధ్యలో కోటెకల్‌ ఫారెస్టు ఏరియాలో చిన్న పిచ్చుకలు, పక్షులు, వన్యప్రాణులు ముళ్లపొదల్లో నివాసం ఉండేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వన్య ప్రాణులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీరేష్‌, సృజన్‌, సూర్య పాల్గొన్నారులబ్ధిదారులు తృప్తి చెందేలా చూడాలి స్పందనలో స్వీకరించిన అర్జీలను లబ్ధిదారులు తృప్తి చెందేలా పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. స్పందనలో డివిజన్‌ పరిధిలోని ఆయా ప్రాంతాల లబ్ధిదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితులు అడిగిన సమస్యకు అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరిస్తే బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలో ఉండవని తెలిపారు. అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్య పరిష్కారమవుతుందా లేదా అని అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. పరిపాలన అధికారి గోవింద్‌ సింగ్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, డిఎల్‌డిఒ నాగేశ్వరరావు, ఆర్‌టిసి డిపో మేనేజర్‌ మహ్మద్‌ రఫీ, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ కె.లక్ష్మీనారాయణ, ఉప తహశీల్దార్లు వలీ బాష, కౌసర్‌ బాను పాల్గొన్నారు.

➡️