శాశ్వత రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేత

Mar 1,2024 21:00

పత్రాలు అందజేస్తున్న సర్పంచి అరుణ్‌ కుమార్‌

– సర్పంచి అరుణ్‌ కుమార్‌
ప్రజాశక్తి – దేవనకొండ
మండలంలోని తెర్నేకల్‌ గ్రామ సచివాలయంలో జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు శాశ్వత హక్కు కల్పించే విధంగా రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేసినట్లు సర్పంచి అరుణ్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం సర్పంచి అరుణ్‌ కుమార్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో 300 మంది పట్టాలకు గాను మొదటి విడతగా 161 లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఎంపిపి భర్త లుముంబా, ఎంపిటిసి సభ్యులు నామాల శ్రీను, మాజీ ఎంపిటిసిలు ఈరన్న, రాఘవేంద్ర, వార్డు సభ్యులు దొడ్డప్ప, పంచాయతీ కార్యదర్శి రాముడు, విఆర్‌ఒ మునీర్‌ బాష, ఇంజినీర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌, వైసిపి నాయకులు ఏసేపు, సొలోమోన్‌ పాల్గొన్నారు.

➡️