శ్రీమఠంలో ఘనంగా శ్రీసుయతీంద్ర తీర్థుల ఆరాధన

Jan 13,2024 19:53

పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతులు

ప్రజాశక్తి – మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీసుయమీంద్ర తీర్థుల ఆరాధనను పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం శ్రీసుయమీంద్ర తీర్థుల ఆరాధన సందర్భంగా ఆయన బృందావనాన్ని నిర్మాల్యం చేసి పంచామృతాభిషేకం, తులసి అర్చనతో మంగళ హారతులు ఇచ్చారు. అంతకుముందు రాఘవేంద్రుని ఆరాధ్య దైవమైన మూలరాములకు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రుని బృందావనాన్ని దర్శించుకుని నైవేధ్య సమర్పణతో మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీసుయమీంద్ర తీర్థుల బృందావనాన్ని దర్శించుకుని నైవేధ్య సమర్పణ చేశారు. శ్రీసుయమీంద్ర తీర్థుల బృందావనాన్ని పుష్ప హారాలతో అందంగా అలంకరించారు.

➡️