24 గంటల దీక్షలతో పోరాటం ఉధృతం

Jan 5,2024 20:38

ఎమ్మిగనూరులో మాట్లాడుతున్నసిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు

– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు
– 25వ రోజూ అంగన్వాడీల సమ్మె
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
నేటి నుంచి విజయవాడలో చేపట్టే 24 గంటల నిరాహార దీక్షలతో సమ్మె మరింత ఉధృతం అవుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు తెలిపారు. అంగన్వాడీల సమ్మెలో భాగంగా 25వ రోజు శుక్రవారం ఎమ్మిగనూరు ప్రాజెక్టు వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా నడిపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వం సమస్యను పక్కదోవ పట్టించకుండా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మె 100 రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని అంగన్వాడీ వర్కర్లను కోరారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడవద్దని ధైర్యం చెప్పారు. అంగన్వాడీల సమ్మెను ఉధృతం చేయడానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ముందుకు రావడంతో అభినందించారు. అలాగే సిడిపిఒ కార్యాలయం, తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సిఐటియు డివిజన్‌ అధ్యక్షులు పి.గోవిందు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నాగలక్ష్మి, శైలజ, నీరజ, పుష్పవతి, శిరోమణి, మల్లేశ్వరి, కృష్ణవేణి, సునీత, గౌసియా, సుమిత్ర, మేరీ, జయమ్మ, బండా లత, గ్రేసమ్మ, పార్వతీ, తులసి, రాగమ్మ, శంషాద్‌ బాను పాల్గొన్నారు. ఆస్పరి సచివాలయం దగ్గర చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజు చేరుకోవడంతో మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. సిఐటియు, ఎఐటియుసి నాయకులు హనుమంతు, కృష్ణమూర్తి, డివైఎఫ్‌ఐ నాయకులు మురళీ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రాణి, ఈరమ్మ, ప్రమీల, నాగమణి, మెహరున్‌, గీతా వాణి, అంజినమ్మ పాల్గొన్నారు. కౌతాళం మండలంలో అంగన్వాడీల సమ్మె 25వ రోజుకు చేరడంతో 25వ సంఖ్య ఆకారంలో కూర్చొని అంగన్వాడీలు నిరసన చేపట్టారు. అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మల్లయ్య పాల్గొన్నారు. ఆలూరులో ‘జగనన్న.. నీ పాలనకు, మోసాలకు నీకో దండం’ అంటూ అంగన్వాడీలు సమ్మె శిబిరంలో పొర్లుదండాలతో నిరసన చేపట్టారు. 25వ రోజు సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కెపి.నారాయణస్వామి మాట్లాడారు. సిఐటియు నాయకులు కృష్ణ, డివైఎఫ్‌ఐ నాయకులు గోవర్ధన్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జయశ్రీ, భారతి, బాలరంగమ్మ, లక్ష్మీ, సరస్వతి, సుజాత, ప్రభావతి, పుష్పవతి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

➡️