బూటు కాళ్లతో తన్నిన దాడిని ఖండించండి

Mar 9,2024 15:50 #Kurnool

ఢిల్లీలో నమాజ్ చేస్తున్న వారిపై  దాడి చేసిన ఎస్సై  చర్యలు తీసుకోవాలి
ఆవాజ్ కమిటీ 

ప్రజాశక్తి-కర్నూలు కార్పోరేషన్ : నమాజ్ చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీస్ బోటు కాలితో తన్నిన వైనాన్ని తీవ్రంగా ఖండించిన ఆవాజ్ కమిటీ.దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇంద్ర లోక్ ప్రాంతంలో, నమాజు చేస్తున్న, వ్యక్తులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. దీన్ని ఆవాజ్ నగర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షులు, పి ఇక్బాల్ హుస్సేన్ , ఆవాజ్ నగర కార్యదర్శి, షేక్ మొహమ్మద్ షరీఫ్ లు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో ఖండించారు. నమాజు చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు ,ఇంద్రాలోక్ పోలీస్ స్టేషన్ ఎస్సై బూటు కాళ్లతో తన్నారు. దీన్ని ఆవాజ్ కమిటీగా తప్పు పట్టడమైనది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడం చాలా విచారకరం అన్నారు. అత్యంత నిరంకుశమైన ఈ దాడిని ఆవాస్ కమిటీ ఖండిస్తుందని తెలియజేశారు. అక్రమ అనైతిక చర్యలకు బాధ్యులైన పోలీసులపై జాప్యం లేకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు ఈ దాష్టకానికి వడి కట్టారని విమర్శించారు. దేశ రాజధానిలో మతపరమైన ఉద్రి కతలు రెచ్చగొట్టే లక్ష్యంతోనే ఈ దాడి చేయించినట్లు తెలుస్తోందని ఆవాస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆవాజ్ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉందని వారు తెలియజేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి బందోబస్తు చర్యలను తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

➡️