హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కు పుత్రికా వియోగం

Mar 9,2024 15:53 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు వాసి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్. రామాంజనేయులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం ఆశీర్వాదమ్మ దంపతులకు పుత్రిక వియోగం కలిగింది. వారి పుత్రిక ఆర్. సౌమ్య(38) గురువారం రాత్రి అనారోగ్యానికి గురి కావడంతో కర్నూలు నగరం, గాయత్రి ఎస్టేట్ లోని విశ్వభారతి హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈమె కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. పీజీ సీటు కోసం శ్రమిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ గురై కావడంతో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు.

మృతురాలు కుటుంబానికి పలువురు పరామర్శ

హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామాంజనేయులు కూతురు సౌమ్య మరణ వార్త తెలుసుకున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, కార్యదర్శి వర్గ సభ్యులు పి రాధాకృష్ణ, తో పాటు ఐదు రాష్ట్ర అధ్యక్షులు కే కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకట స్వామి, బారాసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎస్ లక్ష్మణ్, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ టి నరసింహ తోపాటు పలువురు ప్రముఖులు మృతురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.

➡️