కోపతాపాలు వీడి కలసి పనిచేయండి

Apr 10,2024 22:04

ప్రజాశక్తి-లక్కవరపుకోట : సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు టిడిపి, జనసేన నాయకులంతా కలసి గెలుపుకోసం పనిచేయాలని విశాఖ లోక్‌సభ టిడిపి అభ్యర్థి భరత్‌ పిలుపు నిచ్చారు బుధవారం స్థానిక ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన జనసేన పార్టీ నియోజక వర్గ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిధులుగా భరత్‌తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిని కోళ్ల లలిత కుమారి, టిడిపి నాయకులు గొంప కృష్ణ, జనసేన నాయకులు వబ్బిన సత్యన్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భముగా జనసేన 5 మండలాల నాయకులూ కూటమిలో తమకు గౌరవం దక్కడం లేదని, తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు. భరత్‌ స్పందిస్తూ ఎన్నికలు పూర్తయ్యేవరకు కోప తాపాలు వదిలి గెలుపునకు కృషి చేయాలన్నారు. గొంపకృష్ణ, కోళ్ల లలిత కుమారి కలిసి పనిచేసే వాతావరణం రావడం గెలుపుకు శుభసూచికంగా ఆయన పేర్కొన్నారు. జనసేన నాయకులకు, కార్యకర్తలకు స్థానిక సంస్థల్లో టిడిపితో కలిసి అవకాశం కల్పిస్తామనిగొంపకృష్ణ, కోళ్ల లలిత కుమారి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు షేక్‌ ఫిరోజ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన రంజాన్‌ విందులో అందరూ పాల్గొన్నారు.

➡️