విద్యుత్‌ కార్మికుల సమస్యలను పరిశీలిస్తాం

Jun 17,2024 23:31

ప్రజాశక్తి – చిలకలూరిపేట : విద్యుత్‌ శాఖలో కాంటాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది అనేక సమస్యలతో సతమతమ వుతున్నారని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాం ట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ముజఫర్‌ అహ్మద్‌ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్ట నున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికు మార్‌ను చిలకలూరిపేటలోని ఆయన నివాసంలో సోమవారం కలిసి విన్నవించా రు. తొలుత మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు అనంతరం కార్మికుల సమస్యలను వివరించారు. కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ వర్కర్ల సమస్యలపై ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా ఇప్పటి వరకు సరైన స్పందన లేదని చెప్పారు. తెలంగాణ తరహాలో జీతాలను నేరుగా కార్మికుల ఖాతాలకు జమ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కొన్నిచోట్ల వాచ్‌మెన్‌లు లేరని, వారిని వెంటనే నియమించాలని అన్నారు. స్మార్ట్‌ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మీటరు రీడిండ్‌ తీసేవారి జీవనోపాధి దెబ్బతింటోందని, వీరికి మరో ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. యూనియన్‌ కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, మీటర్‌ రీడింగ్‌, ముఠా కార్మికుల సమస్యలను వివరించారు. అనంతరం మంత్రి స్పందిస్తూ కొద్దిరోజుల్లోనే తాను మంత్రిగా బాధ్యతలు చేపడతానని, అనంతరం ఈ సమస్యలపై పరిశీలిస్తామని, కార్మిక సంఘాలతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.రాజశేఖర్‌, గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులునాయక్‌, ప్రసాదు పాల్గొన్నారు.

➡️