పుడమిని కాపాడుకుందాం

ప్రజాశక్తి-వీరబల్లి భూతాపం తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు మొక్కల నాటి సంరక్షించు కోవాలని వీరబల్లి జడ్‌పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్య కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. విద్యార్థులకు భూమిని సంరక్షించు కోవడానికి వ్యర్థ నుంచి రక్షించుకోవడం ఎలా అని విద్యార్థులకు వివరించారు. విద్యుత్‌ అవసరం లేనప్పుడు విద్యుత్‌ బల్బులను ఆర్పి వేయడం, వక్షాలను అనవసరంగా కత్తిరించరాదన్నారు. విద్యు త్తును తగ్గించడానికి సిఎఫ్‌ఎల్‌ బల్బులు వాడాలన్నారు. సోలార్‌ ప్యానల్స్‌ వాడడం, పేపర్లను రెండు వైపులా వాడడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేశారు. వ్యాసరచన పోటీలు, ఉప న్యాసంలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆంగ్లభాష ఉపాధ్యాయులు రాజశేఖర్‌ పాల్గొన్నారు.జ్ఞానాంబికలో ఘనంగా ధరిత్రీ దినోత్సవంమదనపల్లి : పేస్‌ స్వచ్చంధ సంస్థ, శ్రీ జ్ఞానాంబిక విద్యా సం స్థలు కలసి మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌, న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ధరిత్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ‘పేస్‌’ సంస్థ డైరెక్టర్‌ వి.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవాళి మను గడకు, పర్యావరణానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీవ్ర హాని చేస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్‌ ప్రభావంతో భూమిపై నివస ిస్తున్న ప్రాణులన్నింటికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని, తెలిపారు. మనం ప్రతి సంవత్సరం 400 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఉత్పత్తి చేయబడిన ఏడు బిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలలో, 10 శాతం కంటే తక్కువ రీసైకిల్‌ చేయ బడిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ రమాదేవి మాట్లా డుతూ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలని, ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే భూతాపం మరింత పెరిగి, 2100 కల్లా భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండబోదని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయని అన్నారు. పేస్‌ సంస్థ నిర్వాహకుడు యం. ఉత్తమేశ్వర్‌ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని. ప్లాస్టిక్‌ను సరిగ్గా పారవేయనప్పుడు, అది జల మార్గాలు, మహాసముద్రాలలోకి చేరుతుందని , అది సముద్ర జీవులకు ముప్పు కలిగిస్తున్నదని, జంతువులు ప్లాస్టిక్‌ శిది óలాలలో చిక్కుకుపోతాయనిఅన్నారు. ఈ సందర్భంగా పట్టం లో విద్యార్థులతో ర్యాలీ, ప్లాస్టిక్‌ ఏరివేత కార్యక్రమాన్ని నిర్వ హించారు. భూమిపై ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్రభావం అనే అంశంపై చిత్రలేఖన పోటీలలో విజేతలుగా నిలిచిన విధ్యా ర్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్య్రక్రమాలలో వైస్‌ ప్రిన్సి పల్‌ రాఘవేంద్ర, లెక్చరర్లు శ్రీరాములు, బి.రెద్దెప్ప, యం.మునీంద్రనాయక్‌ శరత్‌నాయక్‌, రమ్య పాల్గొన్నారు. కడప అర్బన్‌ : ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా కెఎల్‌ఎం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు భూమిని ఎలా కాపాడుకోవచ్చు అని పోస్టర్ల ద్వారా తెలియచేశారు. తర్వాత భూమిని సంరక్షించుకునే భాధ్యత అందరిదీ అని తెలిపారు. భూమిని ఎలా సంరక్షించి పర్యావరణాన్ని కాపాడి, మొక్కల్ని నాటడం ద్వారా కాపాడు కోవచ్చని ఓ చిరు నాటిక ద్వారా తెలిపారు. ఆ తరువాత భూమి సంరక్షణ పైన ప్రదర్శించిన నత్య రూపకం ఆహు తులను అలరించింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.ధరిత్రి దినోత్సవం వేడుకలు ఘనంగా జరపడం పట్ల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, కరస్పాండెంట్‌ రాజేశ్వరి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.వి.రత్నమ్మ, కెఎస్‌ఆర్‌ఎం అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పి.ప్రేమ్‌కుమార్‌ విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు.

➡️