రోల్‌ మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

Apr 29,2024 21:22

ప్రజాశక్తి- డెంకాడ : నెల్లిమర్లని రోల్‌ మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. జన విజయ యాత్రలో భాగంగా మండలంలోని చింతలవలస, రఘుమండ గ్రామ పంచాయ తీలలో ఆమె సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ గత ఐదేళ్లగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, స్థానిక సంస్థల్లో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, కనీసం దోమల మందు కూడా కొట్టించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గత ఐదేళ్లగా ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో కనిపించారా? ప్రజల సమస్యలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఈసారి గాజు గ్లాస్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్‌, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు పల్లె భాస్కరావు, నాయకులు కలిదిండి పాణిరాజు, పిన్నింటి తమ్ము నాయుడు, జనసేన మండల కో ఆర్డినేటర్‌ పైలా శంకర్‌, ఉత్తరాంధ్ర మహిళ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ తుమ్మి లక్ష్మి రాజ్‌, పిన్నిటి రాజారావు, అట్టాడ ప్రమీల పాల్గొన్నారు.

➡️