నాగబాబును కలిసిన మలిశెట్టి వెంకటరమణ

Nov 28,2023 14:55 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు నాగబాబును మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్‌ మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నట్లు ఆయన వివరించారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని నాగబాబు సూచించినట్లు మలిశెట్టి వివరించారు. అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలో జనసేన రాజకీయ పరిస్థితులను సవి వివరంగా నాగబాబుకు వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, నాయకులు భాస్కర్‌ పంతులు, పోలిశెట్టి రజిని, పోలిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️