ఉపాధి హామీ పథకం రక్షణకు పోరాటాన్ని ఉధృతం చేయాలి : మండల నేతలు

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు పోరాటం ఉధృతం చేయాలని మండల నాయకులు బి.వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉలవలపూడి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … కేంద్రలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, 200 రోజులు పని దినాలు చూపించాలని, రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గ్రామ కమిటీ ని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా పమర్తి శ్రీరామూర్తి, కార్యదర్శిగా మొదుగుగుమూడి శివకీర్తి, సహాయ కార్యదర్శిగా పామర్ధి రాజ్యలక్ష్మి, కమిటీ సభ్యులుగా సూరగని ఆదిలక్ష్మి, డోకిపర్తి రమణమ్మ, పామర్తి సుబ్బమ్మ, అరెపల్లి సాంబశివరావు, యార్లగడ్డ వెంకటేశ్వరమ్మ, ఉయ్యురు వెంకటేశ్వరరావు, కారుమంచి గణేష్‌ లను ఎన్నుకున్నారు. ఎఫ్‌.ఏ.. కు రూ.26 వేలు, మెస్ట్రీకి రూ.10 వేలు జీతం ఇవ్వాలని, పలుగు, పారా, మంచినీరూ, తదితర సౌకర్యాలను గతంలో మాదిరిగా పునరుద్ధరించాలని, ఆన్‌ లైన్‌ మాస్టర్‌ విధానం రద్దు చేయాలంటూ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు.

➡️