నాటుసారా తయారీ చట్టరీత్యా నేరం

ప్రజాశక్తి-వాల్మీకిపురం నాటుసారా తయారీ, విక్రయాలు చట్టరీత్యా నేరమని వాల్మీకిపురం సిఐ పులిశేఖర్‌ అన్నారు. గురువారం మండలంలోని చింతపర్తిలో సిఆర్‌పిఎఫ్‌ బల గాలతో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మాణంలో ఆగిపోయిన ఓ ఇంట్లో 50 లీటర్ల నాటుసారాను గుర్తించి, సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడా నాటుసారా తయారీ, విక్రయాలు చేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా నాటుసారా విక్రయాలు, తయారీ జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడైనా గలాటాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగ ుతుందన్నారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, డబ్బులు చేతులు మారడం వంటి వాటిపై నిఘా ఉంచామని, అలాంటి సంఘటనలు జరిగితే చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నాగే శ్వరరావు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు ఉన్నారు.

➡️