అందరికీ సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు

Feb 17,2024 19:58

సీతంపేట: గిరిజన గ్రామాల్లో చేపడుతున్న సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు 0 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శనివారం స్థానిక ఐటిడిఎ పరిధిలోని అన్ని మండలాల ఎంపిడిఒలు, పిహెచ్‌సి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని అన్ని గ్రామాల్లో పరీక్షలు చేయాలన్నారు. ఇంకా గ్రామాల్లో, పాఠశాలల్లో పరీక్షలు చేసుకోనివారంటే వారిని గుర్తించి టెస్టులు చేయాలని అన్నారు. పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతిరోజు చేసిన పరీక్షల రిపోర్టులను ఐటిడిఎ కార్యాలయానికి అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల డిఎంహెచ్‌ఒలు మీనాక్షి, జగన్నాధరావు, డిప్యుటీ డిఎంహెచ్‌ఒ విజయ పార్వతి, స్థానిక ఎంపిడిఒ గీతాంజలితో పాటు 19మండలాల ఎంపిడిఒలు, వైద్యాధికారులు సాయిచరణ్‌, రవీంద్ర, భాను ప్రతాప్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️