అరాచక పాలనకు చరమగీతం పాడాలి

Mar 29,2024 21:52

మెంటాడ: వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి కోరారు. శుక్రవారం మెంటాడ మండలంలోని కంటుభుక్తవలస గ్రామ శివారులో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆమె ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసిపి అవలంబిస్తున్న అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌ దేవ్‌, టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకటరావు, సీనియర్‌ నేతలు గెద్ధ అన్నవరం, గొర్లె ముసలినాయుడు, పల్లి సింహాద్రి నాయుడు, జనసేన నేతలు రాజశేఖర్‌, విష్ణువర్థన్‌, శివశంకర్‌ పాల్గొన్నారు.

➡️