‘ఆడుదాం ఆంధ్ర’లో క్రీడాకారుల ప్రతిభ

Feb 5,2024 21:12

సీతంపేట : ఆడుదాం ఆంధ్ర జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన పోటీల్లో ఖోఖో క్రీడలో గొయ్యిది సచివాల యానికి చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 9వ తేది నుండి విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. ఈ మేరకు వీరిని ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి కల్పన కుమారి సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ గీతాంజలి, సీతంపేట స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ జాకబ్‌ దయానందం, గొయ్యిది సర్పంచ్‌, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️